
ఏటీఎం దోపిడీ దొంగ అరెస్ట్
సాక్షి,బళ్లారి: నగరంలోని కాళమ్మ సర్కిల్ సమీపంలో యాక్సిస్ బ్యాంక్ వద్దనున్న ఏటీఎంలో ఉన్న డబ్బులను దొంగలించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మంగళవారం తెల్లవారు జామున నగరంలోని కాళమ్మ స్ట్రీట్ యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి సీడీఎంను ఓపెన్ చేస్తున్న సందర్భంలో బ్యాంక్ వద్ద డ్యూటీ చేస్తున్న నింగప్ప అనే వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో బ్రూస్‌పేట్ ఏఎస్‌ఐ మల్లికార్జున హుటాహుటిన ఏటీఎం వద్దకు చేరుకోవడంతో ఏటీఎంను దొంగలిస్తున్న వ్యక్తిని పట్టుకొని కాసేపు ఇద్దరు తోపులాడుకున్నారు. వెంటనే మరో పోలీస్‌కు సమాచారం అందించడంతో మల్లికార్జునతో పాటు రాత్రి గస్తీ తిరుగుతున్న అనిల్, సిద్దేశ్ ఏటీఎం వద్దకు చేరుకుని ఏటీఎంను దొంగలిస్తున్న వెంకటేష్ అనే వ్యక్తిని పట్టుకుని అరెస్ట్ చేశారు. సదరు దొంగ అనంతపురం నగరంలోని సాయినగర్ వాసి అని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఏటీఎం దొంగను పట్టుకున్నందుకు జిల్లా ఎస్పీ శోభారాణి, డీఎస్పీ నందారెడ్డి అభినందించారు.

ఏటీఎం దోపిడీ దొంగ అరెస్ట్

ఏటీఎం దోపిడీ దొంగ అరెస్ట్