
నకిలీ రికార్డులతో ఖాతా మార్పిడి
రాయచూరు రూరల్: నగరంలో నిజమైన అస్తులు కలిగిన వారు ఒక్కసారి నగరసభ కార్యాలయానికి వెళ్లి ఆస్తులు తమ పేరు మీద ఉన్నాయో, లేదో అని విచారణ జరపాల్సిన పరిస్థితి నగర ప్రజలకు దాపురించింది. మధ్యవర్తులు, అధికారులు ఏకమై నకిలీ రికార్డులతో ఖాతా తయారు చేసి అక్రమంగా ఇతరులకు విక్రయించిన ఘటన నగరంలో వెలుగు చూసింది. సంతోష్ అనే వ్యక్తి స్థలంలో నకిలీ రికార్డులు తయారు చేసి ఇతరులకు విక్రయించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించారు. రాయచూరు, సిరవార, లింగసూగూరు తాలూకాలో ఇలాంటి అక్రమాలు జరిగాయి. ఈ విషయంలో 36 మందిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అక్రమంగా కొనుగోలు చేసిన ఆంజనేయ, సంతోష్ శాన్‌బాగ్, సబ్ రిజిస్ట్రార్, ఎఫ్‌డీసీ నారాయణ, రాజు, నగరసభ ఎస్‌డీసీ నరసింహులు, డీడీ, రైటర్ లోక్‌నాథ్‌రెడ్డి, రామప్ప, మారెప్ప, ప్రసాద్, మసూద్ వలి, అక్షయ్ భండారి, మహ్మద్ ముజాహిద్, విద్యా, సురేష్ ఇలా 21 మందిపై కేసు నమోదైంది. విచారణ చేపట్టిన పోలీసులు ప్రస్తుతం జావిద్, ఎహసాన్ అహ్మద్‌లను అరెస్ట్ చేిసినట్లు జిల్లాధికారి నితీష్ తెలిపారు. 15 రోజుల్లో పూర్తి నివేదిక అందించాలని ఎస్పీని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
ఇద్దరు నిందితుల అరెస్ట్
36 మందిపై కేసు నమోదు

నకిలీ రికార్డులతో ఖాతా మార్పిడి