
ఆరోగ్య శిబిరాల లబ్ధి పొందండి
హొసపేటె: నగరంలోని 12వ వార్డు చిత్తవాడిగిలోని జామియా మసీదు షాదీమహల్ ప్రాంగణంలో ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరులోని సప్తగిరి ఆస్పత్రి అధికారి విశ్వనాథ్ రెడ్డి, డాక్టర్ విక్రమ్, సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ వరుణ్, కార్డియాలజిస్ట్ డాక్టర్ నీలేష్, న్యూరాలజిస్ట్ డాక్టర్ షైనేష్ శిబిరంలో పాల్గొన్న దాదాపు 455 మందిని పరీక్షించారు. వారికి కిడ్నీలలో రాళ్లు, గుండె జబ్బులు, న్యూరోపతి, క్యాన్సర్, అనేక ఇతర వ్యాధుల కోసం పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. అవసరమైన వారికి తదుపరి చికిత్సకు సిఫార్సు చేశారు. అంతకు ముందు శిబిరాన్ని హుడా చైర్మన్, అంజుమన్ ఇస్లాం కమిటీ అధ్యక్షుడు హెచ్‌ఎన్ మహమ్మద్ ఇమాం నియాజీ మాట్లాడుతూ ఆరోగ్య శిబిరాలతో పేద, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతోందన్నారు. బీపీఎల్ కార్డు, ఆరోగ్య కార్డు, యశస్విని కార్డుదారులకు ఉచిత పరీక్ష ఉంటుందన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు అస్లాం మాళిగి, ఖాజా హుస్సేన్, వేదికపై నియాజీ, మళగి కాఖా సబా, ఇస్మాయిల్, హఫీజ్‌సాబ్ హనీఫ్, చిత్తవాడగి జామియా మసీదు కమిటీ మేనేజ్‌మెంట్ బోర్డు ఆఫీస్ బేరర్లు కెరెనళ్లి నజీర్ అహ్మద్, కోల్కి జాకీర్ హుస్సేన్, మళగి గౌస్, ఆజం, వి.చాంద్ బాషా, అంజుమన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.