
భీమా.. 5,465 కేజీలు
● దసరా ఏనుగుల తూకం ప్రక్రియ
● భీమా అత్యధిక బరువు
మైసూరు: దసరా ఉత్సవాల కోసం మైసూరుకు వచ్చిన దసరా ఏనుగులకు సోమవారం బరువు తూచారు. వర్షం పడుతున్నా కూడా అటవీ సిబ్బంది, పోలీసులు ప్యాలెస్ నుంచి ఏనుగులను కేఆర్ సర్కిల్ మీదుగా ధన్వంతరీ రోడ్డులో ఉన్న సాయిరామ్ ఎలక్ట్రికల్ కాటాకు తీసుకెళ్లారు. అక్కడ ఒక్కో గజరాజును బరువు కొలిచారు. 25 ఏళ్ల భీమ పేరుకు తగినట్లుగా ఎక్కువ బరువు తూగింది. కెప్టెన్ అభిమన్యు రెండవ స్థానంలో ఉంది. ఏనుగులు నగర వీధుల్లో వరుసగా వెళ్తుంటే ప్రజలు ఉత్సాహంగా చూశారు. పుష్టిగా ఆహారం పెట్టడం వల్ల దసరా ముగిసేనాటికి ఏనుగుల బరువు కొన్ని వందల కేజీల మేర పెరుగుతుంది.

భీమా.. 5,465 కేజీలు

భీమా.. 5,465 కేజీలు

భీమా.. 5,465 కేజీలు