
కళ్యాణ కర్ణాటకలో కుండపోత వర్షం
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో గురువారం రాత్రి భారీ వర్షం కురిిసింది. ఎక్కడ చూసినా రహదారులు బురద గుంటలుగా మారాయి. ఉదయం ఎండలు వేడిని పుట్టించాయి. మంత్రాలయం రహదారిలో నీరు నిలిచిపోయి ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగాయి. మున్నూరు వాడి, గాంధీచౌక్, మహావీర్ చౌక్‌లోకి వర్షపు నీరు చొరబడ్డాయి. కలబుర్గి జిల్లా చించోళిలో ముల్లామారి పథకం కింద నిర్మించిన నాగరాళ జలాశయం నుంచి నీరు వదలడంతో వాగులో నీరు అధికంగా ప్రవహించాయి. ముదగల్‌లో వాన నీటితో వాగులో నీరు పొంగి ప్రవహిస్తున్నాయి.
పొంగిపొర్లుతున్న వాగులు
కాలనీలు, రోడ్లు జలమయం

కళ్యాణ కర్ణాటకలో కుండపోత వర్షం