పొగాకు వ్యసనం మానండి
బనశంకరి: ఇటీవల రోజుల్లో పాఠశాల విద్యార్థులకు పొగాకు ఉత్పత్తులు చాలా సులభంగా లబించడం చాలా ప్రమాదకరమని ఫిడిలిటస్ ఎండీ అచ్యుత్‌గౌడ అన్నారు. ప్రపంచ పోగాకు రహితదినోత్సవం సందర్బంగా శనివారం శిల్పా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో బనశంకరి రెండోస్టేజ్ ట్రాఫిక్‌సిగ్నల్ వద్ద జనజాగృతి నిర్వహించారు. సిగరెట్, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులకు నేటి యువత, బాలలు బానిసలు కావడం బాధాకరమని చెప్పారు. పొగాకు సేవనాన్ని త్యజించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి లభిస్తుందని తెలిపారు. పొగ తాగడానికి బదులు పుస్తక పఠనం మంచి అభ్యాసమని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలకు పూలు, పండ్లు అందించి పొగాకు వ్యసనాన్ని మానాలని కోరారు.


