డీసీసీబీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భంగపాటు
కోలారు: తీవ్ర కూతూహలం రేకెత్తించిన డిసిసి బ్యాంకు డైరెక్టర్‌ల ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. బ్యాంకు పాలక మండలిలో 18 మండి డైరెక్టర్‌లు ఉండి ఇందులో 6 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. మిగిలి 12 డైరెక్టర్ల స్థానాలకు జరిగిన ఎన్నికలో 8 స్థానాల ఫలితాలు వెలువడి, ఇంకా 4 స్థానాల ఫలితాలు కోర్టు ఆదేశాల మేరకు రిజర్వులో ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం పాలక కాంగ్రెస్ పార్టీకి నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఎన్నికలలో డిసిసి బ్యాంకు మాజీ అధ్యక్షుడు బ్యాలహళ్లి గోవిందగౌడతో పాటు మాజీ డైరెక్టర్‌లు, కొత్త అభ్యర్థులు బరిలోకి దిగారు. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోలారు ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, కేజీఎప్ ఎమ్మెల్యే రూపా శశిధర్, బాగేపల్లి ఎమ్మెల్యే సుబ్బారెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. బరిలో ఉన్న పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర కసరత్తులు చేసినా ఫలించలేదు. బ్యాలహళ్లి గోవిందగౌడను ఓడించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నిక అనంతరం విలేకరులతో మాట్లాడిన బ్యాలహళ్లి గోవిందగౌడ తనకు ప్రాణహాని జరిగితే అందుకు మాజీ మంత్రి కె ఆర్ రమేష్‌కుమార్ కారణమని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు రచ్చ చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు.
గోవిందగౌడ ఎన్నిక


