పారదర్శకంగా కులగణన
సాక్షి,బళ్లారి: కులగణనలో ఏ ఒక్క కులానికీ, మతానికి అన్యాయం జరగకూడదనేది తమఅభిమతమని, ఇందులో రాజకీయాలకు తావులేదని సీఎం సిద్ధరామయ్య అన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం బెళగావికి విచ్చేసిన సందర్భంగా విమానాశ్రయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కుల గణన లెక్కలు పారదర్శకంగా జరిగాయన్నారు. మంత్రివర్గ సమావేశంలో కులగణన లెక్కలను ఏ ఒక్క మంత్రి వ్యతిరేకించలేదన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు దాటినా పేదలు పేదరికంలోనే ఉండాలా? అని ప్రశ్నించారు. లింగాయత్, బ్రాహ్మణ, ఒక్కలిగ, జైనులు ఇలా అన్ని సముదాయాలకు సామాజికంగా, ఆర్థికంగా విద్యాపరంగా న్యాయంజరుగుతుందన్నారు. కులగణనపై రాహుల్‌గాంధీ తమకు లేఖ రాయలేదన్నారు. కులగణనను ఆయన వద్దనే ప్రస్తావించామన్నారు.ప్రతిపక్ష నేత ఆర్ ఆశోక్ ఎప్పుడూ నిజాలు చెప్పలేదని, బీజేపీ రాజకీయలబ్ధి కోసం అసత్యాలను ప్రచారం చేస్తోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి మంత్రివర్గ సమావేశంలో చర్చించి కులగణనపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.
రాహుల్‌గాంధీ ఒప్పుకున్నారు
ఏ మతానికీ, కులానికీ అన్యాయం జరగదు
మరోసారి మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం
సీఎం సిద్ధరామయ్య


