యశవంతపుర: టీవీ సీరియల్ నటునిగా కనిపిస్తున్న ఇతడు ఓ మోసగాడు. ఐఏఎస్ ఆధికారినని చెప్పుకొంటూ యువతులు, మహిళలను మోసగిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. మ్యాట్రిమొని వెబ్‌సైట్‌లో జీవన్‌కుమార్ అనే వ్యక్తి వివరాలు నమోదు చేసుకున్నాడు. యువతులతో చాటింగ్ చేస్తూ తాను ఐఏఎస్‌నని, పెళ్లి చేసుకొంటానని చెబుతూ, తల్లికి క్యాన్సర్ వైద్యానికి అర్జంటుగా డబ్బులు కావాలని లక్షల రూపాయలు వసూలు చేసేవాడు. తరువాత వారితో సినిమాలు, షికార్లకు వెళ్లి సన్నిహితంగా ఫోటోలు, వీడియోలు తీసుకొనేవాడు. మొదట రూ.3 లక్షలు తీసుకొని, మరోదఫా రూ. 5 లక్షలు కావాలంటూ డిమాండ్ చేసేవాడు. డబ్బులు ఇవ్వని మహిళల ప్రైవేట్ ఫోటో, వీడియోలను ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించేవాడని పోలీసుల విచారణలో బయట పడింది. ఇచ్చిన డబ్బులను తిరిగి అడిగితే హత్య చేస్తానంటూ బెదిరించేవాడు. దేశవ్యాప్తంగా సుమారు 20 మంది మహిళలకు మోసం చేసిన్నట్లు తెలిసింది. ప్రస్తుతం బెంగళూరుకు చెందిన మహిళ మోసపోవటంతో జీవన్‌కుమార్‌పై హెబ్బాళ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
ఐఏఎస్‌నంటూ వసూళ్లు