గాడిద పాల డెయిరీకి బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

గాడిద పాల డెయిరీకి బ్రేక్‌

Sep 21 2024 1:06 AM | Updated on Sep 21 2024 1:43 PM

-

హొసపేటెలో మూసివేసిన అధికారులు

హొసపేటె: గాడిద పాలు అనేక ఔషధ గుణాలు కలిగినవని కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగడంతో ఆ పాలకు ఎనలేని గిరాకీ నెలకొంది. చిన్న కప్పు పాలు రూ. వందలు పలుకుతున్నాయి. అదే అదనుగా కొందరు గాడిద పాల పేరుతో వ్యాపారాలు ప్రారంభించారు. ఇదే మాదిరిగా హొసపేటె పట్టణంలో జెన్నీ మిల్క్‌ పేరుతో ఓ షాపు వెలసింది. అందులో గాడిద పాలను అమ్మేవారు. దానికి ట్రేడ్‌ లైసెన్స్‌ లేకపోవడంతో నగరపాలక సంస్థ అధికారులు గురువారం తాళం వేశారు.

రూ.3 లక్షలు తీసుకుని గాడిదలు ఇచ్చి..
గత కొన్ని నెలలుగా జనం నుంచి తలా రూ. 3 లక్షలను తీసుకొని తలా 3 ఆడ గాడిదలను, 3 పిల్లలను ఇచ్చేవారు. వారు గాడిదల నుంచి పాలను సేకరించి ఇస్తే జెన్నీ నిర్వాహకులు కొనుగోలు చేసేవారు. ఇందులో మోసం జరుగుతోందని కొందరు రైతు నేతలు జిల్లా కలెక్టర్‌ ఎంఎస్‌ దివాకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విచారణ జరిపి ట్రేడ్‌ లైసెన్స్‌ లేక పోవడంతో మూసివేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో జెన్ని మిల్క్‌ కంపెనీ, హొసపేటెలో కార్యాలయం ఉన్నాయి. డెయిరీని మూసివేయడంతో పాల విక్రేతలు ఆందోళనకు గురయ్యారు.

 

గాడిద పాల డెయిరీకి బ్రేక్‌ 1
1/1

గాడిద పాల డెయిరీకి బ్రేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement