అందాల భామలే దిష్టిబొమ్మలు | - | Sakshi
Sakshi News home page

అందాల భామలే దిష్టిబొమ్మలు

Jul 20 2024 12:40 PM | Updated on Jul 20 2024 12:46 PM

అందాల భామలే దిష్టిబొమ్మలు

అందాల భామలే దిష్టిబొమ్మలు

చిక్కబళ్లాపురం: పొలాల్లో దిష్టిబొమ్మలు ఉండడం మామూలే. కానీఆ పొలాన్ని చూస్తే సుందరాంగుల పోస్టర్లు కనువిందు చేస్తాయి. దాని వెనుక ఓ కథ ఉంది. చిక్కబళ్లాపురం జిల్లా శిడ్లఘట్ట తాలూకా హండిగనాళ గ్రామంలో యువ రైతు దీపక్‌ 5 ఎకరాలలో టమాటా పంటను సాగుచేశాడు. ఇప్పుడు టమాటా రేటు బాగా పెరిగింది. 

పంటకు ఎవరి దిష్టీ తగలరాదని భావించిన రైతు నర దృష్టిని మళ్లించేలా ఒక ఉపాయం పన్నాడు. బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌, కన్నడ నటి రచితా రామ్‌ బ్యానర్లను తోటలో పెట్టాడు. అందరూ ఈ అందాల భామలను ఆశ్చర్యంగా చూసి వెళుతున్నారు. కాబట్టి తన పంటకు ఎలాంటి ఇబ్బంది లేదని రైతు నమ్ముతున్నాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement