breaking news
Scarecrows
-
అందాల భామలే దిష్టిబొమ్మలు
చిక్కబళ్లాపురం: పొలాల్లో దిష్టిబొమ్మలు ఉండడం మామూలే. కానీఆ పొలాన్ని చూస్తే సుందరాంగుల పోస్టర్లు కనువిందు చేస్తాయి. దాని వెనుక ఓ కథ ఉంది. చిక్కబళ్లాపురం జిల్లా శిడ్లఘట్ట తాలూకా హండిగనాళ గ్రామంలో యువ రైతు దీపక్ 5 ఎకరాలలో టమాటా పంటను సాగుచేశాడు. ఇప్పుడు టమాటా రేటు బాగా పెరిగింది. పంటకు ఎవరి దిష్టీ తగలరాదని భావించిన రైతు నర దృష్టిని మళ్లించేలా ఒక ఉపాయం పన్నాడు. బాలీవుడ్ నటి సన్నీ లియోన్, కన్నడ నటి రచితా రామ్ బ్యానర్లను తోటలో పెట్టాడు. అందరూ ఈ అందాల భామలను ఆశ్చర్యంగా చూసి వెళుతున్నారు. కాబట్టి తన పంటకు ఎలాంటి ఇబ్బంది లేదని రైతు నమ్ముతున్నాడు. -
జూన్ 2న వెయ్యి దిష్టిబొమ్మల దహనం
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా దళితుడుని చేస్తామని వెయ్యిసార్లు చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఇచ్చిన హామీ విస్మరించి తానే అందలమెక్కేందుకు సిద్ధం అవుతున్నారని మాదిగ విద్యార్థి సమాఖ్య(ఎంఎస్ఎఫ్) జిల్లా అధికార ప్రతినిధి కాశీమల్ల సురేష్, ఆ సంఘం రాష్ట్ర నాయకుడు చెరుకుపల్లి శాంతికుమార్లు విమర్శించారు. కేసీఆర్ దళితులకు ఇచ్చిన మాట తప్పడాన్ని నిరసిస్తూ ఆయన ప్రమాణ స్వీకారం రోజున వెయ్యి దిష్టిబొమ్మలు దహనం చేయనున్నట్లు తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ దొరలపాలన తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జూన్ 2న అంబేద్కర్ విగ్రహం ఎదుట రాష్ట్ర ఆవిర్భావాన్ని స్వాగతిస్తూ కేక్ కట్ చేసి అనంతరం కేసీఆర్ తీరును నిరసిస్తూ నల్లజెండాలు ఎగురవేస్తామన్నారు. ముందుగా జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి 30వ తేదీన అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం పదవిని దళితులకిచ్చి తాను ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కె.దుర్గయ్య, వెంకన్న, స్వామి తదితరులు పాల్గొన్నారు.