సినీ నిర్మాత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

సినీ నిర్మాత ఆత్మహత్య

Apr 15 2024 1:05 AM | Updated on Apr 15 2024 9:34 AM

- - Sakshi

ఉదయం 9 గంటల సమయంలో తన నివాసంలో ఆయన ఉరివేసుకోగా కుటుంబ సభ్యులు గమనించి రాజాజీనగర సుగుణ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.

కర్ణాటక: కన్నడ సినీ నిర్మాత సౌందర్యజగదీశ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మహాలక్ష్మీలేఔట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఉదయం 9 గంటల సమయంలో తన నివాసంలో ఆయన ఉరివేసుకోగా కుటుంబ సభ్యులు గమనించి రాజాజీనగర సుగుణ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. సౌందర్య జగదీష్‌ పలు వివాదాలతో గతంలో వార్తల్లోకి ఎక్కారు.

ఇరుగుపొరుగువారితో పాటు కుటుంబసభ్యులతో గొడవపెట్టుకుని వివాదంలో చిక్కుకున్నారు. ఈయనకు చెందిన జెట్‌లాగ్‌ పబ్‌లో కొద్దినెలల క్రితం కాటీర చిత్ర బృందం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పార్టీ చేసుకున్నట్లు ఆరోపణలు కూడా వినిపించాయి. దీంతో 25 రోజుల పాటు రెస్టోబార్‌ లైసెన్సు రద్దుచేశారు. సౌందర్యజగదీష్‌ రియల్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. తమ్ముడి కుమారుడు స్నేహిత్‌ను సినిమారంగానికి పరిచయం చేశారు. ఇటీవల ప్రియాంకా ఉపేంద్ర ఏర్పాటుచేసిన హోలీ కార్యక్రమంలో సౌందర్యజగదీశ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement