నీటి పాట్లు.. పెళ్లికి అగచాట్లు | - | Sakshi
Sakshi News home page

నీటి పాట్లు.. పెళ్లికి అగచాట్లు

Mar 12 2024 8:05 AM | Updated on Mar 12 2024 9:41 AM

- - Sakshi

బనశంకరి: బెంగళూరు నగరంలో వేసవి నీటి కొరత ప్రజలను పీడిస్తోంది. అలాగే యువకులు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు కూడా దొరకడం లేదు. నరేంద్ర అనే యువకుడు తన స్నేహితునికి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకడం లేదని సోమవారం ఎక్స్‌లో బాధ వెళ్లబోసుకున్నాడు. ఇందుకు నీటి సమస్యే కారణమని చెప్పాడు. తన పోస్టును కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి ట్యాగ్‌ చేశాడు.

రాహుల్‌గాంధీ గారు.. దయచేసి మీరు బెంగళూరులో నీటి సమస్యను పరిష్కరించాలి. ఐటీ ఉద్యోగం చేస్తున్న నా స్నేహితుడు వధువు కోసం ఎంతగానో గాలించినా ప్రయోజనం లేదు. ఐటీ సిటీలో నీటి సమస్య వల్ల అమ్మాయిలు పెళ్లికి ఒప్పుకోవడం లేదని నా స్నేహితుడు బాధపడినట్లు తెలిపాడు. మొత్తం మీద ఈ ఎండాకాలం సిలికాన్‌ సిటీకి చుక్కలు చూపిస్తోంది. గత నెలరోజుల నుంచి బెంగళూరులో నీటి కొరత తీవ్రరూపం దాల్చింది.

నీటి బొట్టుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నీటిని సరఫరా చేయడానికి ప్రభుత్వం, బెంగళూరు జలమండలి శ్రమిస్తున్నాయి. లక్ష బోర్లు ఎండిపోయాయి. నగరంలో 257 ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement