2028లో సంకీర్ణ సర్కారు | - | Sakshi
Sakshi News home page

2028లో సంకీర్ణ సర్కారు

Nov 7 2026 12:36 AM | Updated on Nov 7 2026 12:36 AM

మైసూరు: రాష్ట్రంలోని పేదల, రైతుల, హిందూ వ్యతిరేక కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించి, 2028 ఎన్నికల్లో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చే వరకు తాను విశ్రమించబోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర అన్నారు. శుక్రవారం నగరంలోని టౌన్‌ హాల్‌ ప్రాంగణంలో బీజేపీ నిర్వహించిన ’ప్రజాస్వామ్యాన్ని కాపాడండి–అరాచకాన్ని తొలగించండి’ మార్చ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. గత మూడేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల రక్తాన్ని పీలుస్తోందన్నారు. డీకే శివకుమార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత, పేదలు, రైతులు ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు రూ.2500 పరిహారంగా ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి, దానిని ఇంకా విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మూడోసారి ప్రధానమంత్రి అయిన మోదీ నాయకత్వాన్ని సహించలేక, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూలదోయడానికి కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ కమ్యూనిస్టులతో కలిసి కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి అరాచకం సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శాసన మండలి చీఫ్‌ విప్‌ ఎన్‌.రవికుమార్‌, ఎంపీ యదువీర్‌, సీటీ రవి తదితరులు పాల్గొన్నారు.

మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తాం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement