యాదగిరి జిల్లా బంద్‌ విజయవంతం | - | Sakshi
Sakshi News home page

యాదగిరి జిల్లా బంద్‌ విజయవంతం

Nov 7 2026 12:36 AM | Updated on Nov 7 2026 12:36 AM

రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని రాయచూర్‌ జిల్లాకు చెందిన లింగసూగూరు, దేవదుర్గ, యాదగిరి జిల్లాలోని సురపుర తాలూకా పరిధిలో ఉన్న నారాయణపూర్‌ కుడి కాలువలకు నిరంతరంగా నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ యాదగిరి జిల్లా బంద్‌ చేపట్టారు. శుక్రవారం సురపుర తాలూకాలోని యడహళ్లి గ్రామంలో రైతు బసప్ప ఎండిన ముళ్ల చెట్టుపై పడుకొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. జిల్లా బంద్‌ ప్రభావంతో యాదగిరిలో దుకాణాలు, హోటళ్లు మూతపడగా.. వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. బస్సు సర్వీసులను కూడా పూర్తిగా నిలిపివేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రాజు గౌడ మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌బీసీ కాలువలకు నవంబర్‌ 30వ తేదీ వరకు నిరంతరంగా నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లో 33 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని తెలిపారు. తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైతులకు సాగునీటిని విడుదల చేయాలని కోరారు. కాలువల చివరి భూములకు కూడా నీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement