ప్రేమోన్మాది వేధింపులకు విసిగి.. | - | Sakshi
Sakshi News home page

ప్రేమోన్మాది వేధింపులకు విసిగి..

Jan 14 2024 1:18 AM | Updated on Jan 14 2024 7:35 AM

 సంగీత (ఫైల్‌),         నిందితుడు శివు   - Sakshi

సంగీత (ఫైల్‌), నిందితుడు శివు

ప్రేమించాలని యువకుని వేధింపులు తట్టుకోలేక యువతి ప్రాణాలు తీసుకుంది. ఈ దుర్ఘటన హాసన జిల్లా బేలూరు తాలూకా నిడగూడు గ్రామంలో జరిగింది.

యశవంతపుర: ప్రేమించాలని యువకుని వేధింపులు తట్టుకోలేక యువతి ప్రాణాలు తీసుకుంది. ఈ దుర్ఘటన హాసన జిల్లా బేలూరు తాలూకా నిడగూడు గ్రామంలో జరిగింది. జయణ్ణ కూతురు సంగీత (21)తో తమ కుమారుడు శివుకు పెళ్లి చేయాలని అతని తల్లిదండ్రులు అడిగితే తిరస్కరించారు. ప్రేమించాలని శివు తరచూ సంగీతను వేధించేవాడు. ఈనెల 11న సంగీత కుటుంబం బేలూరులోని అయ్యప్పస్వామి గుడికి వెళ్తే శివు వచ్చి ప్రేమించాలని సతాయించాడు.

ఆమెను దూషించి తలపై కొట్టాడు. నన్ను ప్రేమించకుంటే హత్య చేస్తానని, నేను ఫోన్‌ చేస్తే మాట్లాడాలని హెచ్చరించాడు. గుడిలో అందరి ముందు ఇలా అవమానించడంతో సంగీత కుంగిపోయింది. ఇంటికి వచ్చాక గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంది. శివు వేధింపులే కారణమని తల్లిదండ్రులు బేలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా శివును అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement