
యశవంతపుర: పోక్సో కేసు కింద అరెస్టయిన మురఘాశ్రీ బెయిల్ పిటిషన్ ఈనెల 15కు చిత్రదుర్గ జిల్లా కోర్టు వాయిదా వేసింది. ఇప్పుటికే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మురుఘాస్వామి తరపు న్యాయవాది సందీప్ పాటీల్ శుక్రవారం మధ్యాహ్నం కోర్టుకు అందించారు. ష్యూరిటీ వివరాలను పరిశీలించటానికి కేసును ఈ నెల 15కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. స్వామి బెయిల్ కోసం ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర సోదరుడు కేసీ నాగరాజు, మధుసూధన్‌లచే లక్ష రూపాయల బాండ్‌ను అందించారు.
కేఐఏలో రూ. 3.9 కోట్ల
బంగారం స్వాధీనం
దొడ్డబళ్లాపురం: విదేశాల నుంచి కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఏడుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు రూ.3.9 కోట్ల విలువైన బంగారాన్ని సీజ్ చేసారు. కువైట్, షార్జా, దుబాయ్, అబుదాబి, బ్యాంకాక్ దేశాల నుండి కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు వచ్చిన వీరు లోదుస్తుల్లో, పర్సు, హ్యాండ్ బ్యాగ్‌లలో బంగారాన్ని, పేస్టు, క్యాప్సూల్ రూపంలో అక్రమంగా తీసుకువచ్చారు. చెకింగ్ సమయంలో వీరంతా పట్టుబడ్డారు. రెండు రోజుల్లో రూ.3.9 కోట్ల విలువైన బంగారాన్ని సీజ్ చేసినట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
