బనశంకరి: ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని పారిశ్రామికవేత్త నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేసిన కేసులో మూడో ఆరోపి, హొసపేటెకు చెందిన అభినవ హాలశ్రీ స్వామీజీని బుధవారం బెంగళూరులోని 19 వ ఏసీఎంఎం కోర్టులో సీసీబీపోలీసులు హాజరుపరిచారు. ఆయనకు 29వ తేదీ వరకు సీసీబీ కస్టడీకి ఆదేశించింది. ఆయన న్యాయవాదులు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. సీసీబీ పోలీసుల వాదన వినిపించాలని జడ్జి 29వ తేదీకి వాయిదా వేశారు.
హాలశ్రీ మంగళవారం ఒడిశాలో పట్టుబడడం తెలిసిందే. నోటుకు సీటు స్కాంలో సీసీబీ పోలీసులు తీవ్ర విచారణ చేపడుతున్నారు. చంద్రాలేఔట్‌లోని స్వామీజీ ఇంట్లో నగదు కోసం గాలించారు. మళ్లీ మైసూరులో నగదు ఉంచినట్లు చెప్పగా అక్కడకు తీసుకెళ్లే అవకాశం ఉంది.


