జేడీఎస్‌ నేత యువతులతో రాసలీలలు .. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ | - | Sakshi
Sakshi News home page

జేడీఎస్‌ నేత యువతులతో రాసలీలలు .. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Sep 2 2023 1:18 AM | Updated on Sep 2 2023 8:43 AM

- - Sakshi

రాయచూరు రూరల్‌: జేడీఎస్‌ యువ విద్యార్థి విభాగం అధ్యక్షుని రాసలీలలు బయట పడ్డాయి. శుక్రవారం దేవదుర్గ తాలూకా యువ జేడీఎస్‌ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలీం కాకరగల్‌ నలుగురు యువతులతో రాసలీలల్లో మునిగి తేలిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని అమాయక యువతులను వలలో వేసుకున్నట్లు ఆరోపణలున్నాయి.

విడివిడిగా వారితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్‌ కావడం సంచలనం కలిగించింది. ఇలా యువతుల బతుకులను బుగ్గిపాలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని పలు పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో జేడీఎస్‌ సీనియర్‌ నేతలు స్పందిస్తూ వ్యక్తిగతంగా వారి మధ్య వ్యవహారం ఉండవచ్చన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement