రైల్వే అండర్‌పాస్‌లోకి వాన నీరు | - | Sakshi
Sakshi News home page

రైల్వే అండర్‌పాస్‌లోకి వాన నీరు

Jun 30 2023 1:44 AM | Updated on Jul 1 2023 6:49 AM

ద్విచక్ర వాహనాన్ని మోసుకెళుతున్న వ్యక్తి - Sakshi

ద్విచక్ర వాహనాన్ని మోసుకెళుతున్న వ్యక్తి

కర్ణాటక: గత రెండు రోజులుగా కురుస్తున్న జడివాన నేపథ్యంలో గురువారం నగరంలోని అరబ్‌ మొహల్లా అండర్‌పాస్‌లోకి వాన నీరు చేరాయి. దీంతో మన్సలాపూర్‌, యక్లాసపూర్‌, మర్చేడ్‌, హొసపేటె వంటి కుగ్రామాలకు వెళ్లే ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం మన్సలాపూర్‌ నుంచి ద్విచక్ర వాహనంలో పాలు విక్రయించడానికి వచ్చిన వ్యక్తి వాహనం నీటిలో తడవకుండా ఉండేందుకు మోసుకు రావడం కనిపించింది.

కాగా ఎంపీ రాజా అమరేశ్వర నాయక్‌, ఎమ్మెల్యే శివరాజ్‌ పాటిల్‌, దక్షిణ మధ్య రైల్వే మండలి సలహా సమితి సభ్యుడు బాబురావ్‌లు ఏడాది క్రితం రైల్వే అండర్‌ బ్రిడ్జిలో నీరు నిలబడకుండా మరమ్మతు పనులు చేయిస్తామని చెిప్పి మాట తప్పారని ప్రజలు అక్రోశం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement