పోకిరీ వేధింపులతో బాలిక ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పోకిరీ వేధింపులతో బాలిక ఆత్మహత్య

Jun 18 2023 6:58 AM | Updated on Jun 18 2023 6:58 AM

- - Sakshi

కర్ణాటక: పాఠశాలకు వెళుతున్న బాలికను ప్రతిరోజు యువకుడు వేధిస్తుండటంతో ఆవేదనకు లోనైన బాలిక ఉరి వేసుకొని తనువు చాలించింది. ఈ సంఘటన మైసూరు తాలూకాలోని బంచహళ్ళిహుండి గ్రామంలో జరిగింది. వివరాలు.. రమేష్‌ కుమార్తె చందన (15) పాండవపుర ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన వెంకటేష్‌ కుమారుడు శరత్‌ ఈ బాలిక వెంటపడుతూ ప్రేమ పేరిట వేధించేవాడు.

పాఠశాలకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు వెంటాడి పీడించడంతో బాలిక భయపడిపోయింది. తండ్రికి ఈ విషయం చెప్పగా ఆ పోకిరీని మందలించారు. అయినా కూడా దుండగునిలో మార్పు రాలేదు. అతని వేధింపులను తట్టుకోలేని బాలిక శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నంజనగూడు గ్రామీణ పోలిసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement