బెంగళూరులో హైదరాబాద్‌ యువతి దారుణ హత్య.. అర్ధరాత్రి ఏం జరిగింది? | - | Sakshi
Sakshi News home page

బెంగళూరులో హైదరాబాద్‌ యువతి దారుణ హత్య.. అర్ధరాత్రి ఏం జరిగింది?

Jun 7 2023 6:24 AM | Updated on Jun 7 2023 10:42 AM

- - Sakshi

అర్పిత్‌ పదోన్నతిపై హైదరాబాద్‌కు బదిలీ అయ్యాడు.

కర్ణాటక: సోమవారం రాత్రి బెంగళూరు జీవన్‌బీమా నగర పోలీసుస్టేషన్‌ పరిధిలో యువతి అనుమానాస్పద మృతి చెందింది. హైదరాబాద్‌కు చెందిన ఆకాంక్ష (23)గా గుర్తించారు. ఆమె ప్రియుడు అర్షిత్‌ను పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ నగరంలో ఒక ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్నారు. అర్పిత్‌ పదోన్నతిపై హైదరాబాద్‌కు బదిలీ అయ్యాడు. తన స్నేహితురాలితో కలిసి జీవన్‌బీమా నగర పరిధిలోని కొడిహళ్లిలో అపార్ట్‌మెంట్‌లో ఆకాంక్ష ఉండేది.

అర్పిత్‌ హైదరాబాద్‌ నుంచి వచ్చి అప్పుడప్పుడు ఆమెను కలిసి వెళ్లేవాడు. సోమవారం అర్ధరాత్రి ఆమె అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన అర్పిత్‌ గొడవ పడ్డాడు. ఈ సమయంలో ఆమెను గొంతు పిసికి హత్య చేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఆకాంక్ష రూంమేట్‌ విధులు ముగించుకుని తెల్లవారుజామున రూంకు రాగా హత్య విషయం బయట పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. అర్పిత్‌ కోసం గాలింపు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement