సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ ముఠాలపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ ముఠాలపై ఉక్కుపాదం

Jul 25 2026 1:11 AM | Updated on Jul 25 2026 1:11 AM

బనశంకరి: సైబర్‌, ఆర్థిక నేరాలు, డ్రగ్స్‌ విక్రయాలను కూకటివేళ్లతో పెకలించి ఉత్తమ సమాజం నిర్మించాలని పోలీస్‌ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర డీజీపీ ఎంఏ.సలీం సూచించారు. శుక్రవారం కోరమంగల కేఎస్‌ఆర్‌పీ కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్‌ బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించిన అనంతరం శాఖలో అసాధారణ సేవ, ప్రామాణికత, ధైర్య సాహసాలు ప్రదర్శించిన 200 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బందికి ప్రశంస డీజీ, ఐజీపీ కమాండేషన్‌ డిస్క్‌లను ప్రదానం చేసి ఆయన మాట్లాడారు. సైబర్‌, ఆర్థిక నేరాలు, మాదకద్రవ్యాలు మనకు పెను సవాల్‌గా మారాయి. వీటిని మనం తీవ్రంగా పరిగణించి కూకటివేళ్లతో పెకలించాలన్నారు. ఇటీవల సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ ముఠాల బెడద పెచ్చుమీరింది. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌ ముఠాల నిర్మూలనకు కంకణం కట్టుకుంది. ఈదృష్టితో అందరూ పకడ్బందీగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి

ఒకదేశం లేదా రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటే అభివృద్ధితో పాటు పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు అధిక సంఖ్యలో వస్తారని, శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రాభివృద్ధికి శ్రమించాలని సలహా ఇచ్చారు.

ఆధునిక పరిజ్ఞానంతో నేరస్తులకు చెక్‌

ఆధునిక యుగంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతోందని, మనం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తులకు అడ్డుకట్ట వేయాలన్నారు.

పెను సవాల్‌గా మారిన

మాదకద్రవ్యాల నిర్మూలన

ఉత్తమ సమాజ నిర్మాణానికి

డీజీపీ సలీం ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement