బనశంకరి: భక్తుల మొక్కులు తీర్చే బనశంకరీదేవి సన్నిధిలో ఆషాఢమాస సందడి నెలకొంది. ఆషాఢమాసం రెండో శుక్రవారం సందర్భంగా వేకువజామున సుప్రభాతసేవ అనంతరం ఆలయ అర్చకులు ఏ.చంద్రమోహన్ ఆధ్వర్యంలో బనశంకరీదేవి మూలవిరాట్‌కు విశేష అభిషేకం, అర్చనలు చేపట్టి గాజులతో విశేష అలంకరణ చేశారు. శాకంబరీదేవి మూలవిరాట్‌కు లీలావినోదినిగా అలంకరణచేపట్టి పూజలు నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున ఆలయానికి తరలివచ్చి నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధనచేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదానం చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసింది.


