బూడిదైన పెళ్లి బస్సు | - | Sakshi
Sakshi News home page

బూడిదైన పెళ్లి బస్సు

Apr 23 2023 2:12 AM | Updated on Apr 23 2023 7:20 AM

పూర్తిగా కాలిపోయిన బస్సు  - Sakshi

పూర్తిగా కాలిపోయిన బస్సు

మండ్య: బెంగళూరు నుంచి మైసూరుకు వెళ్తున్న పెళ్లి బస్సు మండ్య జిల్లా శ్రీరంగ పట్టణం వద్ద మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. బస్సులోని వారందరూ దిగిపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు.. మైసూరు నగరంలో ఉన్న రుక్మిణి కళ్యాణ మండపంలో జరిగే పెళ్లికి వధువు కుటుంబం, బంధువులు కలిసి బెంగళూరు నుంచి బయల్దేరారు.

జాతీయ రహదారిపై శ్రీరంగ పట్టణం తాలూకా గణంగూరు వద్ద బస్సు వెనుక చక్రానికి రాయి తగిలి పెద్ద శబ్ధం వచ్చింది. వెంటనే బస్సు డ్రైవర్‌ బస్సు నిలిపి చూడగా పొగలు వస్తుండగా బస్సులో ఉన్నవారిని అందరినీ దిగిపోవాలని చెప్పాడు. కొన్ని క్షణాల్లోనే మంటలు అంటుకుని బస్సు మొత్తం వ్యాపించాయి. ఫైర్‌ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసేటప్పటికి బస్సు మొత్తం కాలి బూడిదైంది. ప్రయాణికుల లగేజి కొంతభాగం కాలిపోయింది.

లగేజీని బయటకు తీస్తున్న దృశ్యం 1
1/1

లగేజీని బయటకు తీస్తున్న దృశ్యం

Advertisement
 
Advertisement
Advertisement