కరీంనగర్‌క్రైం: శనివారం రాత్రి నుంచి ఆదివా రం వేకువజామున వరకు కమిషనరేట్‌వ్యాప్తంగా నిర్వహించిన నాకాబందీలో 115 డ్రంకెన్‌డ్రైవ్ కేసులు నమోదు చేసి, 142 వాహనాలు సీజ్ చేశారు. కరీంనగర్ టౌన్, రూరల్, హుజూ రాబాద్ డివిజన్లలోని 18 పోలీస్‌స్టేషన్ల పరిధి లో ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులు, టోల్‌గేట్లు, శివారుప్రాంతాల్లో ఏకకాలంలో 1,978 వాహనాలను తనిఖీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 115మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 142 వాహనాలు సీజ్ చేశారు. 107 ఈ చలాన్, 200 స్పాట్ చలాన్లు కలిపి మొత్తం 307 చలాన్లు విధించి, రూ.1,13,885 జరిమానా వసూలు చేశారు. 24 ఈ–పెట్టి కేసులు నమోదు చేశారు. 101 పెండింగ్ చలాన్ల ద్వారా రూ.47,715 వసూలు చేశారు. హుజూరాబాద్ డివిజన్‌లో మరో రూ.28,310 పెండింగ్ చలాన్లు క్లియర్ చేశారు.
మధుమేహం సైలెంట్ కిల్లర్
కరీంనగర్: మధుమేహం ప్రపంచ మానవాళికి, ముఖ్యంగా భారతీయులకు సైలెంట్ కిల్లర్‌గా మారుతోందని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ఈ వ్యాధితో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవాలని సూచించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో మధుమేహ అవగాహన ర్యాలీ ప్రారంభించి మాట్లాడారు. శారీరక వ్యాయామానికి ప్రాధాన్యమివ్వడంతోపాటు ఆహార నియమాలు పాటించాలని కోరారు. బస్టాండ్ మీదుగా టవర్ సర్కిల్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో లయన్స్ జిల్లా గవర్నర్ మోరె భద్రేశం, గుండోజు లక్ష్మయ్య, రాజిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
కరీంనగర్: జూనియర్ సివిల్ జడ్జి పరీక్ష ఫలితా ల్లో న్యాయమూర్తులుగా ఎంపికై న చిప్ప సౌమ్య, వేముల హారికలను జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్‌లో ఆదివారం ఘనంగా సన్మానించారు. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చిందం శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గుడెల్లి లక్ష్మినర్సయ్య, ఆర్గనైజేషనల్ సెక్రటరీ కె.వెంకటరమణ పాల్గొన్నారు.
కరీంనగర్‌సిటీ: శాతవాహన యూనివర్సిటీలో భగవాన్ బిర్సా ముండా ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బిర్సాముండా చేసిన పోరాటాలను, ఆదివాసీల హక్కుల కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరా డి, గిరిజనుల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
కరీంనగర్ టౌన్: బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా నవంబర్ 16న కరీంనగర్‌లోని ఐడీవోసీ కార్యాలయంలో సాధారణ ప్రజావాణితోపాటు ప్రత్యేకంగా పిల్లల ప్రజావాణి నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లల హక్కులు, రక్షణ, భద్రత, ఆరోగ్యం, విద్య, పోషకాహారానికి సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, వినతులను ప్రత్యేక డెస్క్ ద్వారా స్వీకరించి రిజిస్టర్‌లో నమోదు చేస్తామన్నారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిల్లలు తమ సమస్యలను స్వేచ్ఛగా వెల్లడించేలా సురక్షితమైన వాతావరణం కల్పించడంతోపాటు వారి వ్యక్తిగత వివరాల గోప్యతను కాపాడుతామని పేర్కొన్నారు.


