వెంటనే విచారణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

వెంటనే విచారణ చేపట్టాలి

Nov 16 2026 12:08 AM | Updated on Nov 16 2026 12:08 AM

శాతవాహన యూనివర్సిటీలో చేపట్టిన నిర్మాణాలు, చెట్ల తొలగింపు, మట్టి తరలింపులపై విచారణ చేపట్టి వాటిని రద్దు చేయాలి. అధికారులకు తెలియకుండా చెట్లు తొలగించిన వారిని గుర్తించి చట్టప్రకారం కేసులు నమోదు చేయాలి. ఉన్నతాధికారులు యూనివర్సిటీలో జరుగుతున్న సంఘటనలపై సిట్టింగ్‌ జడ్జితో కమిటీ వేసి విచారణకు ఆదేశించాలి.

– కరికే మహేశ్‌, జేఏసీ చైర్మన్‌,

శాతవాహన యూనివర్సిటీ

చర్యలు తీసుకోవాలి

కరీంనగర్‌కు ప్రాణవాయువు అందిస్తున్న శాతవాహన యూనివర్సిటీలో సింథటిక్‌ ట్రాక్‌, స్పోర్ట్స్‌ గ్యాలరీ పేరిట జరుగుతున్న పనుల్లో అవినీతి కనిపిస్తోంది. యూనివర్సిటీలో 300 కెమెరాల నిఘాలో ఉన్నా అవినీతి జరుగుతోంది. వందల చెట్లు నరికి వాటి కలపను దోచుకున్న వ్యక్తులపై, అనుమతినిచ్చిన అధికారులపై వెంటనే కేసులు నమోదు చేయాలి.

– వరుణ్‌ శివాజీ, కన్వీనర్‌, ఏఐఎస్‌ఎఫ్‌

శాతవాహన యూనివర్సిటీ

ఎంక్వైరీ జరుగుతోంది

చెట్ల నరికివేతను విశ్వవిద్యాలయ యాజమాన్యం సహించదు. అటవీశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వర్సిటీలో పచ్చదనం, జీవవైవిధ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తాం. ట్రాక్‌, డ్రైనేజీ పనులు పూర్తయిన వెంటనే తొలగించిన చెట్లస్థానంలో పెద్దఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పునరుద్ధరిస్తాం. – సతీశ్‌ కుమార్‌, రిజిస్ట్రార్‌,

శాతవాహన యూనివర్సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement