హుజూరాబాద్: పదేళ్లుగా ఏకగ్రీవ ఎన్నికకు వేదికగా నిలిచిన హుజూరాబాద్ క్లబ్‌లో ఈసారి పోటీ ఎన్నికలు ఉత్కంఠ రేపాయి. హోరాహోరీ పోరులో నూతన పాలకవర్గం కొలువుదీరింది. హుజూరాబాద్ క్లబ్‌లో 326మంది సభ్యులకు ఓటుహక్కు ఉండగా, ఆదివారం జరిగిన పోలింగ్‌లో 308మంది ఓటేశారు. రెండు ఓట్లు చెల్లలేదు. రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌బాబు, ఇంద్రనీల్‌తో పాటు వొడితెల కిషన్‌రావు, శ్రీనివాస్‌రావు, కౌశిక్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం నిర్వహించిన లెక్కింపులో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. క్లబ్ కార్యదర్శిగా కటుకూరి మల్లారెడ్డి 176 ఓట్లతో గెలుపొందారు. ఉపాధ్యక్షుడి పుల్లూరి ప్రభాకర్‌రావు, సహాయ కార్యదర్శిగా శివనాధుని వేణుగోపాల్, కోశాధికారిగా గర్రెపల్లి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈసీ మెంబర్లుగా గడ్డం ధర్మారెడ్డి, కేశిరెడ్డి నరసింహారెడ్డి, పుల్లూరి శ్రీకాంత్, మ్యాకల రాజిరెడ్డి, గోలి సురేశ్, పొనగంటి శ్రవణ్, అకినపల్లి అనిల్, దొనకొండ సత్యనారాయణరెడ్డి విజయం సాధించారు. ఈసీ మెంబర్ల ఓట్ల లెక్కింపులో మాగంటి శ్రీధర్, కోలె కల్యాణ్‌రావులకు చెరో 110 ఓట్లు రావడంతో ఫలితాన్ని పెండింగ్‌లో పెట్టారు. పదేళ్ల ఏకగ్రీవ సంప్రదాయానికి భిన్నంగా ఈసారి పోటాపోటీ ఎన్నికలు జరగడం క్లబ్‌లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల సమయంలో వేర్వేరు అభ్యర్థులకు మద్దతు తెలిపిన సభ్యులందరినీ కలుపుకొని ముందుకు సాగడం కొత్త కార్యవర్గానికి ప్రధాన సవాలుగా మారనుంది.


