కట్టిపడేస్తున్న కళా సిల్క్‌ | - | Sakshi
Sakshi News home page

కట్టిపడేస్తున్న కళా సిల్క్‌

Sep 19 2026 6:14 AM | Updated on Sep 19 2026 6:14 AM

కట్టిపడేస్తున్న కళా సిల్క్‌

శ్రీరాజరాజేశ్వర కల్యాణ మండపంలో చేనేత వస్త్ర మేళా

కరీంనగర్‌: చేనేత వస్త్రాల అందం.. హస్తకళల ప్ర త్యేకతను నగరవాసులకు చేరువ చేసేందుకు కరీంనగర్‌లో కళాసిల్క్‌ సంస్థ ఆధ్వర్యంలో చేనేత వస్త్ర మేళా ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ కోర్టు చౌరస్తాలో ని శ్రీరాజరాజేశ్వర కల్యాణమండపంలో నిర్వహిస్తు న్న ఈ ప్రదర్శన, అమ్మకాల మేళా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణకు చెందిన గ ద్వాల్‌, నారాయణపేట, పోచంపల్లి చేనేత వస్త్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అస్సాం మూగా, ఎరి సిల్క్‌, బి హార్‌ భాగల్పూర్‌ సిల్క్‌, టస్సర్‌, ఛత్తీస్‌గఢ్‌ కోసా సి ల్క్‌, గుజరాత్‌ బాంధనీ, కచ్‌ ఎంబ్రాయిడరీ, జ మ్మూకశ్మీర్‌ ఎంబ్రాయిడరీ, పశ్మీనా శాల్స్‌, కర్ణాటక ప్రింటెడ్‌ శారీస్‌, మధ్యప్రదేశ్‌ చందేరి, మహేశ్వరి, రాజస్తాన్‌ కోటా, బంధానీ, బ్లాక్‌, సంగనేరి ప్రింట్ల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్‌కు చెందిన బనారస్‌, లక్నో డ్రెస్‌ మెటీరియ ల్స్‌ హ్యాండ్లూమ్స్‌ విక్రయిస్తున్నా రు. నగరవాసులు మేళాను సందర్శించి చేనేత, హస్తకళా ఉత్పత్తులను ఆదరించాలని నిర్వాహకులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement