కరీంనగర్‌రూరల్: బొమ్మకల్ పరిధి కృష్ణానగర్‌కాలనీలో గురువారం కాలిపోయిన స్థితిలో లభించిన గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని కాపువాడకు చెందిన శ్రీరాముల కవిత(47)గా కుటుంబసభ్యులు గుర్తించినట్లు కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. రిటైర్డు డెప్యూటీ తహసీల్దార్ శ్రీరాముల రాంచంద్రం కుమార్తె కవితకు 1998లో దేవాదాశాఖ ఉద్యోగి రమేశ్‌తో వివాహం జరిగింది. 2014లో భర్త మృతిచెందడంతో మంకమ్మతోటలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో అటెండర్‌గా పనిచేస్తోంది. కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న కవిత గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయల్దేరి కల్యాణి గార్డెన్ సమీపంలోని చెట్ల పొదల్లో ఒంటిపై పెట్రోల్ లేదా మండే పదార్థాన్ని ఉపయోగించి నిప్పంటించుకుంది. శుక్రవారం పత్రికల్లో వచ్చిన వార్త, ఫొటోలను కుటుంబసభ్యులు చదివి ఆస్పత్రిలోని మృతదేహం పరిశీలించి గుర్తించారు.తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


