కరీంనగర్ స్మార్ట్‌సిటీ.. విశాలమైన రోడ్లు.. ఫుట్‌పాత్‌లు.. ఎల్‌ఈడీ లైట్లతో మెరిసిపోతోంది. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా పేరుగాంచుతోందని నాయకులు పలుకుతున్న ప్రగల్భాలు వారి నిర్లక్ష్యానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. రూ.వందలకోట్లు వెచ్చించి స్మార్ట్‌సిటీ పనులు చేపడితే.. నాలుగు రోజులు కూడా నాణ్యతతో ఉండడం లేదు. నాసిరకమైన పనులు, పాలకుల నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. మంచిర్యాల చౌరస్తా నుంచి మాతాశిశు ఆస్పత్రి చౌరస్తా వరకు ఫుట్‌పాత్ నాసిరకంగా నిర్మించడంతో లైట్స్ బరువుకే కూలిపోయింది. ఆస్పత్రుల ప్రాంతం కావడంతో జనాల రద్దీ ఎక్కువ. డ్రైనేజీ నోళ్లు తెరుచుకుని ఉండగా.. ఇటీవల కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీ పొంగిపొర్లుతోంది. ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరమ్మతు చేపట్టాల్సిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పాలకులు పట్టించుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్


