విద్యానగర్(కరీంనగర్): ఈనెల 28న రాఖీ పండుగ సందర్భంగా కరీంనగర్‌లో రాఖీల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. శాసీ్త్రరోడ్‌లోని రాజస్తాన్, గుజరాత్ హోల్‌సేల్ వ్యాపారుల నుంచి చిరువ్యాపారులు రిటేల్‌గా రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. టవర్ సర్కిల్, ఆఫీస్‌రోడ్‌లో చిరువ్యాపారులు తోపుడు బండ్లపై రాఖీల అమ్మకాలు సాగిస్తున్నారు. ఫ్యాన్సీ రాఖీలు, కుందన్‌లతో చేసిన డిజైన్లు, జువెల్లరీని తలపించే రాఖీలు మార్కెట్లో లభిస్తున్నాయి. రూ.10 నుంచి రూ.300 వరకు వివిధ డిజైన్లతో కూడిన రాఖీలు ఉన్నాయి. జువెల్లరీ షాపుల్లో 1గ్రామ్, వెండి రాఖీలు అమ్ముతున్నారు. హోల్‌సేల్ దుకాణాల్లో పదిరోజుల నుంచి రోజుకు రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వ్యాపారం జరిగిందని వ్యాపారులు పేర్కొన్నారు.


