ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ

Aug 27 2026 12:30 AM | Updated on Aug 27 2026 12:30 AM

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ

కరీంనగర్‌కల్చరల్‌/కరీంనగర్‌క్రైం: మహమ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలో మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను బుధవారం ముస్లింలు ఘనంగా నిర్వహించారు. హుస్సేనీపురలోని బొంబాయి స్కూల్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ నాకా చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గీతా భవన్‌ చౌరస్తా, వన్‌టౌన్‌ నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం మీదుగా రాజీవ్‌ చౌక్‌ కరీముల్లాషా దర్గా వరకు సాగింది. ర్యాలీలో కలెక్టర్‌ చిత్రామిశ్రా, సీపీ గౌస్‌ ఆలం, కాంగ్రెస్‌ నాయకుడు కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి పాల్గొన్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు మళ్లింపులు చేపట్టారు. భగత్‌నగర్‌, గోదాంగడ్డ ప్రాంతాల్లో జైబూన్‌ యూత్‌ క్లబ్‌, ఆదర్శ యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. డిప్యూటీ మేయర్‌ వై.సునీల్‌ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement