కరీంనగర్: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో నగరంలో ‘హర్ ఘర్ తిరంగా’ భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ రాంనగర్ వరకు సాగింది. కళాశాల విద్యార్థులు, యువకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. చేతుల్లో త్రివర్ణ పతాకాలతో ‘భారత్ మాతా కీ జై’, ‘వందేమాతరం’ అంటూ నినదిస్తూ ముందుకు సాగారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే ధర్మారావు మాట్లాడుతూ.. ‘హర్ ఘర్ తిరంగా’ అనేది ప్రజల్లో జాతీయ భావాలను పెంపొందించే గొప్ప ఉద్యమం అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా
అధ్యక్షుడు సాయిని మల్లేశం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.


