సిరిసిల్ల: భారత తొలి ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ తన తొలి కక్ష్య రాకెట్ ‘విక్రమ్–1’ విజయవంతంగా ప్రయోగించి కొత్త చరిత్రను సృష్టించింది. ఆ ప్రయోగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ముగ్గురు యువ ఇంజినీర్ల భాగస్వామ్యం ఉంది. దేశం నాకేమిచ్చిందని ఆలోచించే ఈ రోజుల్లో దేశానికి తాము ఏమిచ్చామనే లక్ష్యంతో అంతరిక్ష ప్రయోగంలో జిల్లా యువకులు పాల్గొనడం విశేషం. పాలిటెక్నిక్ డిప్లొమాతో డీఆర్‌డీవోకు వెళ్లిన సిరిసిల్లలోని సుభాష్‌నగర్‌కు చెందిన అడుప కిరణ్ రాకెట్ క్యాడ్ డిజైనర్‌గా పని చేశారు. పోస్టాఫీస్ వీధికి చెందిన అడుప సంతోష్ భువనగిరిలో బీటెక్ పూర్తి చేసి డీఆర్‌డీఏలో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా చేరారు. మూడేళ్ల పాటు సీనియన్ ఇంజినీర్‌గా ప్రైవేటు కంపెనీలో పని చేసి 2024 నుంచి స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేటు లిమిటెండ్ కంపెనీలో టీమ్ లీడర్‌గా పని చేశారు. రాకెట్‌లో తనిఖీలు, పరీక్షలు, ప్రయోగానికి ముందు కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. సిరిసిల్లలో ప్రాథమిక విద్యను అభ్యసించిన బొమ్మదేని నాగరాజు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశారు. నిజామాబాద్‌లో ఇంటర్, హైదరాబాద్‌లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశారు. అంతరిక్ష ప్రయోగంలో ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ విభాగంలో రాకెట్ విద్యుత్ వ్యవస్థ సమీకరణ పనులను పర్యవేక్షించారు.


