డెంగీ నివారణపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

డెంగీ నివారణపై అవగాహన కల్పించాలి

Aug 15 2026 12:16 AM | Updated on Aug 15 2026 12:16 AM

చిగురుమామిడి:మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు డెంగీ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో రాజగోపాల్‌రావు ఆదేశించారు. చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. రెండు రోజుల క్రితం డెంగీ కేసు నమోదు కాగా బాధితుడి నివాసాన్ని పరిశీలించారు. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో యాంటీ లార్వల్‌ అపరేషన్‌ చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. డాక్టర్‌ ప్రిసిల్లా, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement