తిమ్మాపూర్: శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో మొదటి గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం శుక్రవారం కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఉమేశ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి, క్రమశిక్షణతో చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఫార్మసీ విద్యార్థుల కోసం రానున్న కాలంలో శాతవాహన యూనివర్సిటీలో ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తామని, అందులో శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు తప్పక పాల్గొనాలని కోరారు. కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాణాలను కాపాడే వృత్తిలో ఉన్న ఫార్మసీ విద్యార్థుల సేవలు దేశానికి అవసరమని అన్నారు. సెక్రటరీ సాయి చైతన్య రెడ్డి, డైరెక్టర్ నరేందర్ రెడ్డి పట్టా పొందిన విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.2012– 2026లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు పట్టా సర్టిఫికెట్లు అందించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్
శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో ఘనంగా మొదటి గ్రాడ్యుయేషన్ డే


