అత్యవసర పరిస్థితులను ఎదుర్కొన్నాం | - | Sakshi
Sakshi News home page

అత్యవసర పరిస్థితులను ఎదుర్కొన్నాం

Aug 15 2026 12:16 AM | Updated on Aug 15 2026 12:16 AM

అత్యవసర పరిస్థితులను ఎదుర్కొన్నాం ప్రతీ నిమిషం విలువైంది పది నిమిషాల్లో చేరుకుంటాం

గత 19 ఏళ్లుగా 108 అంబులెన్స్‌ సేవల్లో ఎన్నో అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించాం. రోగులను సకాలంలో ఆసుపత్రులకు తరలించడంతోపాటు వారికి ప్రాథమిక వైద్యం అందిస్తున్నాం. ఎంతో మందిని ప్రాణాపాయం నుంచి తప్పించగలిగాం.

– పెద్ది శ్రీనివాస్‌, సీనియర్‌ పైలట్‌

అత్యవసర చికిత్స అందించే సమయంలో ప్రతీ నిమిషం ఎంతో విలువైంది. ఎన్నో సందర్భాల్లో ట్రాఫిక్‌, వాతావరణ పరిస్థితులు, దూర ప్రాంతాల నుంచి బాధితులను వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేర్చేందుకు కృషి చేస్తున్నాం. ప్రాణాలు నిలిపే 108 పైలట్‌గా సేవలందించడం గర్వంగా ఉంది.

– జలగం సత్యసాగర్‌, ఈఎంటీ

ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే 108 సిబ్బంది పది నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుతున్నారు. ప్రతీ ఆర్నెళ్లకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన కల్పిస్తున్నాం. వాహనాలను ఎప్పటికప్పుడు కండీషన్‌లో ఉంచుతున్నాం. చిన్నచిన్న లోపాలను సరిదిద్దుతున్నాం. 12 సర్వీసులు నిరంతర సేవలందిస్తున్నాయి.

– భూమా నాగేందర్‌,

ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement