కాళేశ్వరం: ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం పోలీసుస్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న హనుమండ్ల కనుకయ్య (52) అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామం కరీంనగర్ జిల్లా మానకొండూరులో జరుగుతాయని పోలీసులు తెలిపారు. కనుకయ్య పదేళ్లుగా కాళేశ్వరంలోనే ఇల్లు నిర్మించుకొని ఉంటున్నారు. అందరితో మర్యాద, కలివిడిగా ఉండేవాడని గుర్తు చేసుకుంటున్నారు.


