రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ విద్యా, వైద్యంపై దృష్టి పెడుతున్నారు. గురుకులాలు, హాస్టళ్లు తరచూ తనిఖీ చేస్తున్నారు. పిల్లలతో కలిసి భోజనం చేస్తున్నారు. వారితో కలిసి పాఠాలు వింటున్నారు.. బోధి స్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రోగులతో మాట్లాడుతూ వైద్య సేవలపై ఆరా తీస్తున్నారు. ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలని ఆమె ఆదేశిస్తున్నారు. కలెక్టర్ చొరవతో రాష్ట్రంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా అగ్రస్థానంలో ఉంది. – సిరిసిల్ల


