కరీంనగర్ కలెక్టర్ చిత్రామిశ్రా 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆ ఫీసర్. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని పటిష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు వరుసలో నిరీక్షించకుండా కుర్చీలు ఏర్పాటు చేశారు. వయోవృద్ధుల సంక్షేమ చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేశారు. పక్షం రోజులకోసారి పర్యవేక్షిస్తున్నారు. సమస్య పరిష్కారం కాకుంటే తదుపరి చర్యలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సిఫారసు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రుల మెయింటెనెన్స్ విషయంలో వారి వేతనాల నుంచి కోత విధించి పేరెంట్స్ ఖాతా లకు మళ్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. – కరీంనగర్ అర్బన్


