మహిళా అధికారులు పాలనలో తమ సత్తా చూపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ విభాగాల అధిపతులుగా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలకమైన ప్రభుత్వశాఖలు, న్యాయస్థానాలు, రెవెన్యూ, పోలీసు, సంక్షేమ విభాగాలు సమర్థులైన మహిళా అధికారుల చేతుల్లో కొనసాగుతున్నాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లుగా చిత్రామిశ్రా, గరీమా అగ్రవాల్ ప్రత్యేక గుర్తింపు పొందుతుండగా.. అత్యంత కీలక హోదాల్లో 50 మందికి పైగా మహిళలు సత్తా చాటుతున్నారు. వందలాది మంది ఉద్యోగులకు మార్గనిర్దేశం చేస్తూ, లక్షలాది మంది ప్రజలకు సేవలందిస్తూ.. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ పరిపాలనలో ఆదర్శంగా నిలుస్తున్నారు.


