ఏటా ఆషాఢమాసంలో సీత్లాభవాని వేడుకలు నిర్వహిస్తారు. చాలా చోట్ల ఇప్పటికే జరుగుతున్నాయి. మా తండాలో ఈ మంగళవారం చేయాలని నిర్ణయించారు. బంధుమిత్రులను పిలుచుకుని ఏడుగురు అక్కాచెల్లెళ్లకు పూజలు చేస్తాం. పాడిపంటలు బాగుండాలని కొలుస్తాం.
– భూక్యా రెడ్డినాయక్, పెద్దూరుతండా, సిరిసిల్ల
మాది కోనరావుపేట మండలం గోవిందరావుపల్లె. గుగులోత్ తండా, డొనబండతండాల్లో ఈ మంగళవారం సీత్లాభవాని వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. కొన్నితండాల్లో గత మంగళవారం చేశారు. అందరం కలిసి వెళ్లి అమ్మవార్లకు పూజలు చేసి అక్కడే వనభోజనాలు చేస్తాం.
– గుగులోత్ జగన్‌నాయక్,
గోవిందరావుపల్లెతండా
మా లంబాడీ తండాల్లో వనదేవతలను పూజించడం ఆనవాయితీ. ము ఖ్యంగా సీత్లా భవాని వేడుకలు, తీజ్ పండుగలు ముఖ్యమైనవి. తీజ్ పండుగ గిరిజన అమ్మాయిలు చేస్తే.. సీత్లాభవాని వేడుకలు మాత్రం అందరం కలిసి చేసుకుంటాం.
– ఇస్లావత్ సుజాత, దేవుడితండా, నిమ్మపల్లి
మా గిరిజనులం అందరం కలిసి మెలిసి ఈ పండుగను జరుపుకుంటాం. గిరిజనుల ఐకమత్యానికి ఈ పండుగ నిదర్శనం. పాడిపంటలు బాగుండాలని యాటపిల్లను బలి ఇచ్చి.. పశువులను దాటిస్తుంటాం. – తిరుపతినాయక్,
బాకూర్‌పల్లితండా సర్పంచ్


