అన్న.. అక్క.. ఏఐ పాఠం | - | Sakshi
Sakshi News home page

అన్న.. అక్క.. ఏఐ పాఠం

Jul 17 2026 3:16 AM | Updated on Jul 17 2026 3:16 AM

గంభీరావుపేట(సిరిసిల్ల): అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని దృషి్‌ోట్ల పెట్టుకొని ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆర్టిషియల్‌ ఇంటలిజెన్స్‌(ఏఐ) పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ శ్రీఅన్న.. అక్క.. మెంటార్షిప్‌శ్రీ(ఏ బుక్‌ ఆన్‌ డిజిటల్‌ లెర్నింగ్‌) పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిగ్రీ, పాలిటెక్నిక్‌ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఏఐ పాఠాలు’ బోధిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచే సాంకేతికాంశాల్లో అవగాహన కల్పించడంతోపాటు నిష్ణాతులుగా తీర్చిదిద్దడమే ఈ ప్రోగ్రామ్‌ ఉద్దేశ్యం. జిల్లా వ్యాప్తంగా గంభీరావుపేట, అగ్రహారం డిగ్రీ కళాశాలలకు చెందిన 80 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గంభీరావుపేట కళాశాలలో నోడల్‌ అధికారులుగా శ్రవణ్‌కుమార్‌, ఆది విష్ణు, మహేశ్‌ వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్‌ వరకు కొనసాగనుంది.

అమలు ఇలా..

ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల విద్యార్థులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు ఏఐ పాఠాలు బోధిస్తున్నారు. ఒక్కో డిగ్రీ కళాశాలకు దాదాపు 40 నుంచి 50 పాఠశాలలు కేటాయించారు. 6 నుంచి 8వ తరగతి పిల్లలకు డిజిటల్‌ లిటరసీ ఇంటర్నెట్‌ సేఫ్టీ కంప్యూటేషన్‌, థింకింగ్‌, ఏఐలోని ప్రాథమికాంశాలు, 9, 10వ తరగతులకు మెషీన్‌ లెర్నింగ్‌ బేసిక్స్‌, పైథాన్‌ ప్రోగ్రామింగ్‌, ప్రాంప్ట్‌ ఇంజినీరింగ్‌, ఏఐ ఎథిక్స్‌ అంశాలపై బోఽధిస్తున్నారు.

స్నేహపూర్వక వాతావరణంలో..

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రోజువారీ ఉపాధ్యాయులు కాకుండా డిగ్రీ, పాలిటెక్నిక్‌ విద్యార్థులతో ఏఐ డిజిటల్‌ బోధన కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఐఐటీ, సాంకేతిక కళాశాల అధ్యాపకులు మెంటర్లుగా పనిచేస్తున్నారు. అంశాల ఎంపిక, బోధన ప్రక్రియ రూపకల్పనకు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. జిల్లా స్థాయిలో డీఈవోలు, మండల స్థాయిలో ఎంఈవోలు, పాఠశాలలో హెచ్‌ఎంలు పర్యవేక్షించనున్నారు.

ప్రభుత్వ బడుల్లో డిగ్రీ, పాలిటెక్నిక్‌ విద్యార్థులతో బోధన

నూతన కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement