తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులో గేదెలను దొంగలించిన అంతర్‌రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు దొంగలను గురువారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.1.30 లక్షలు రికవరీ చేసినట్లు సిరిసిల్ల రూరల్ సీఐ కె.నాగేశ్వరరావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు. గత మే 23న బద్దెనపల్లికి చెందిన ఆరేటి పోచయ్యకు చెందిన రెండు గేదెలు, ఆరేటి వెంకటేశ్‌కు చెందిన ఒక గేదెను గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. బాధితుల ఫిర్యాదుతో తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల గుర్తింపు
పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దొంగతనానికి పాల్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వీర్ల వెంకటరావు(35), చిత్తూరి గంగాధర్(33), వీర్ల మల్లికార్జునరావులుగా గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లగా ముగ్గురిలో ఇద్దరు (వెంకటరావు, గంగాధర్) దొరికారు. మరో నిందితుడు మల్లికార్జునరావు పరారీలో ఉన్నాడు. కేసును చాకచక్యంగా ఛేదించిన తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి, అదనపు ఎస్సై ఎం.మల్లేశం, సిబ్బంది సంపత్‌కుమార్, శ్రీనివాస్‌లను సీఐ అభినందించారు.
ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగల అరెస్ట్


