ఇల్లందకుంట: ఇల్లందకుంట మండలంలోని మర్రివానిపల్లి గ్రామంలో విద్యార్థులు లేక 24ఏళ్లుగా మూతబడి ఉన్న పాఠశాలను తిరిగి ప్రారంభించారు. సర్పంచ్ మర్రి శ్రీనివాస్‌రెడ్డి చొరవతో పాఠశాలలో నూతనంగా 15 మంది చేరగా.. బుధవారం డీఈవో ప్రశాంత్‌రెడ్డి పాఠశాలను పునః ప్రారంభించారు. స్థానిక ప్రజల సహకారంతో పాఠశాలను తిరిగి ప్రారంభించామని సర్పంచ్ తెలిపారు. పాఠశాలలో అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని డీఈవో హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి మర్రి జైసాల్‌రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ కర్ర అశోక్‌రెడ్డి, ఎంఈవో కొర్ర రాములు పాల్గొన్నారు.


