న్యూస్‌రీల్
గురువారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2026
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లా పరిధిలో ఇటీవల జరిగిన హోంగార్డుల బదిలీల ప్రక్రియలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాల్‌పల్లి, సిద్దిపేట, హన్మకొండలో పనిచేస్తున్న 373 మందిని ఈనెల 3న సీపీ గౌస్ ఆలం బదిలీ చేశారు. అంతర్గత, సాంకేతిక కారణాలు, ఆర్‌ఐ, ఇతర అధికారుల జోక్యం, రాజకీయ ఫైరవీలుతో ప్రక్రియ నెమ్మదించింది. గతేడాది జరిగిన హోంగార్డు బదిలీలపై అనేక విమర్శలు వెల్లువెత్తడంతో తాజా బదిలీలపై హోంగార్డులు అనాసక్తితో ఉన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న ఏడు జిల్లాల పోలీస్ అధికారులు సైతం రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వకపోవడంతో పాతస్థానంలో కొనాసాగాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై ‘బదిలీ అయినా కదపరే’ శీర్షికన ‘సాక్షి’ విశ్లేషణాత్మక కథనం ప్రచురించింది. సీపీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు హోంగార్డులకు రిలివింగ్ ఆర్డర్స్ ఇస్తున్నారు. మంగళ, బుధ వారాల్లో పలువురు హోంగార్డులు సిరిసిల్ల, జగిత్యాలకు రిలివింగ్ ఆర్డర్స్ తీసుకుని వెళ్లారు. మిగిలిన వారికి త్వరలోనే ఆర్డర్స్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారులు ‘సాక్షి’కి వివరించారు.


