కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్‌ను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. రూ.840 కోట్ల యూసీఎఫ్ నిధులతో మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రతి మట్టి రోడ్డును సీసీ రోడ్డుగా మారుస్తామని హామీ ఇచ్చారు. యూఐడీఎఫ్ నిధులు రూ.50 కోట్లతో చేపట్టిన పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. నగరపాలక సంస్థ 47వ డివిజన్ రాంనగర్‌లోని సిద్ధార్థ స్కూల్ వద్ద రూ.50 లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు, డ్రైన్, 62వ డివిజన్ మంకమ్మతోట శ్రీరాం బుక్ స్టాల్ నుంచి మోర్ సూపర్ మార్కెట్ వరకు రూ.98 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు, డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే మూడు నెలల్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) స్కీం కింద కేంద్రం మంజూరు చేసిన రూ.840 కోట్ల నిధులతో కరీంనగర్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. స్మార్ట్‌సిటీ నిధులతో కరీంనగర్‌లో పార్కింగ్ సమస్య లేకుండా రూ.25 కోట్లతో శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు. దసరా నాటికి కరీంనగర్, వరంగల్ హైవే రోడ్డు అందుబాటులోకి తెస్తామన్నారు. కరీంనగర్ జగిత్యాల హైవే పనులను ప్రారంభిస్తామని, గన్నేరువరం బ్రిడ్జి పనులకు శ్రీకారం చుట్టబోతున్నామని అన్నా రు. మేయర్ కె.శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై.సునీల్‌రావు, నగర పాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్, కార్పొరేటర్లు గాజే రమ, పెద్దపల్లి జితేందర్, ఎన్నం లక్ష్మి, కల్వకుంట్ల ప్రమోద్‌రావు పాల్గొన్నారు.


