యూఐడీఎఫ్‌ పనులు షురూ | - | Sakshi
Sakshi News home page

యూఐడీఎఫ్‌ పనులు షురూ

Jul 15 2026 12:11 AM | Updated on Jul 15 2026 12:11 AM

యూఐడీఎఫ్‌ పనులు షురూ ● నేడు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌

● నేడు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ సిటీలో యూఐడీఎఫ్‌ నిధులు రూ.50 కోట్లతో చేపట్టనున్న పనులకు మోక్షం లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ బుధవారం 62వ డివిజన్లో రూ. కోటితో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గతంలో యుఐడీఎఫ్‌ నిధులకు సంబంధించి టెండర్‌ ప్రక్రియ రద్దు కావడం, కొత్త పాలక వర్గం కొత్త ప్రతిపాదనలకు ఆమోదం లభించడం తెలిసిందే. 62 వ డివిజన్లోని మంకమ్మతోట శ్రీరాం బుక్‌ స్టాల్‌ నుంచి సీసీ రోడ్డు నిర్మాణం కానుండడంతో స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

డీఈవోగా చైతన్య జైనీ

కరీంనగర్‌టౌన్‌: జిల్లా విద్యాశాఖ అధికారిగా ఖమ్మం డీఈవో చైతన్య జైనీని నియమిస్తూ పా ఠశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ నికోలస్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కరీంనగర్‌లో పనిచేసిన చైతన్య జైనీ ఖమ్మం జిల్లాకు బదిలీపై వెళ్లారు. తాజాగా కరీంనగర్‌కు నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బుధవారం ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.

బాధ్యతలు తీసుకున్న డీడీ

కరీంనగర్‌ టౌన్‌: జిల్లా ఎస్సీ డెవలప్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా భాగ్యలక్ష్మి మంగళవారం రాత్రి బాధ్యతలు తీసుకున్నారు. ఈమేరకు ఆమె కలెక్టర్‌ చిత్రామిశ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని కలెక్టర్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement